గ్రామ దేవతల జాతర్లు

                               http://tirupatigamgamma.blogspot.in/
                గ్రామ దేవతలకు జాతర్లు చేసి పూజించటం మనకు అనాదిగా వస్తున్నా సాంప్రదాయం.

 మన ఆంధ్ర ప్రదేశ్ లో జానపద సంస్కుతి సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యoఉన్నదీ.ఏ జాతరైన,ఏ మతమైన తమ సంస్కుతి సంప్రదాయాలను పరిరక్షించుకున్నఅప్పుడే తర తరాలనుండి వస్తున్న సంస్కుతి వారసత్వం నిర్విర్యమైపోకుండా పది కాలాలపాటు నిలబడి ఉంటుంది

  జాతర్లలో ముఖ్యంగా గ్రామ ప్రజల ఆచార వ్యవహారాలు వారి జీవన విధానాలు,అప్పటి జానపద సాహిత్యం,వారి ఆట పాటలు,కట్టు బొట్టు,మొదలైన విధానాలు అద్దంపట్టినట్లుగా కొట్టువచ్చినట్లు కనబడతాయి. గ్రామ దేవతను పూజిస్తే ఆ దేవత ఆ ఊరి ప్రజలందరినీ కంటికి రెప్పలాగా ఏ వ్యాధులు రాకుండా కాపాడుతుందని ,సకాలంలో వర్షాలను కురిపించి పాడి పంటలను అభివృద్ధి చేస్తుందని గట్టి నమ్మకంతో గ్రామీణ ప్రజలు ఆమెకు ప్రతి యేట జాతర్లన్ను చేసి కొలుస్తారు


         మన రాష్ట్రంలో జరిగే అన్ని జాతర్ల కంటే చిత్తూర్ జిల్లాలోని తిరుపతిలో జరిగే గంగజాతరకు ఒక ప్రతేయ్కమైన స్టానం ఉంది. అన్ని ప్రాంతాల్లో జాతరలు ఒకటి రెండు రోజులు జరిగితే తిరుపతి గంగ జాతర వరుసగా ఏడూ రోజులు జరగటం విశేషం.ప్రతి సంవత్సరం వేసవి కాలం మే నెలలో చాటింపు అయిన మరుసటి రోజు నుంచి ఇక్కడ జాతర ప్రారంభం అవుతుంది. ఈ జాతర చాలా ప్రసిద్దమైనది కాబట్టి చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజలు అనేక వేల మంది ఈ జాతరకు వచ్చి జాతర జరిగే ఏడు రోజులు రక రకాల వేషాలు వేసుకొని భక్తులు మ్రొక్కుబడులను చెల్లించుకొంటారు

 పూర్వం తిరుపతి పరిసర ప్రాంతాలను ఓకే పాలెగాడు(దోర) పాలించేవాడు.అలా ఆ దొర పరిపాలిస్తున్న రోజుల్లో క్రొత్తగా పెళ్లియిన పెళ్లి కూతురుని తొలి సారిగా తనతో కాపురం చేసి అత్తావారింటికి వెళ్ళాలని నిర్భంధం చేసి, పెండ్లియిన ప్రతి స్త్రీని బలాత్కారించేవాడు.

  ఇదే సమయంలో తిరుపతి ప్రక్కనే అవిలాల గ్రామంలో అదిపరాశక్తి అంశతో పుట్టి పెరిగిన గంగమ్మ ఈ దుర్మాగ్గుడి దురాచారాన్ని అంతమొందించాలని తాను పెండ్లి చేసికొని ,అదే రాత్రి వాడి ఇంటికి వెళ్లి తన శక్తి స్వరూపాన్ని చూపించగా వాడు భయంతో తప్పించుకొని పారిపోతే ఆమె రోజు కోక వేషం వేసుకొని వాణ్ణి తిట్టుకొంటూ వెతికి పట్టుకొని తాతయ్యగుంట దగ్గర చంపిందని ఐతిహ్యం

  కనుక ఈ సంఘటనకు గుర్తుగా పూర్వం నుండి భక్తులు ఈ ఏడు రోజులు రోజుకొక వేషం వేసుకొని ఏడు రోజులు జాతర జరుపుతారని  పెద్దలు చెప్పుతారు


  ఇదే కాకుండా మన తిరుపతి గంగమ్మ,లోక రక్షకుడు ప్రత్యక్ష దేవుడుయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలని కుడా ప్రజలంతా చెప్పే వాస్తవం. అందుకనే ఈ జాతరలో తిరుమల నుండి పుట్టింటి కట్నంగా స్వామి వారి నుండి పట్టు శేష వస్త్రాలు,పసుపు,కుంకుమ,గంప,చేట మొదలైన మంగళ ద్రవ్యాలను సారేగా గంగమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి యేట పంపటం ఆచారంగా వస్తున్నది.

   మానవ జేవితంలో ఎన్ని పరిణామాలు జరిగినా మానవుడు ఎంత ఎత్హుకు ఎదిగి పోతున్న,మానవత్వపు విలువలు దిగజారిపోకుండా ఇంకా భగవంతుని విషయంలో భయం,భక్తి,నమ్మకం,మిగిలి ఉన్నాయంటే డానికి అనాదిగా మన పెద్దల నుండి వస్తున్నా ఆచారాన్ని,సాంప్రదాయాన్ని పాటించడమే కారణం.