సర్పరాలు

                                            సర్పరాలు

ఈ ప్రదర్శన మంగళవారం జరుగుతుంది.తెలుగులో `చప్పరం అనే పదమే జనవ్యవహారంలో సప్పరం అయిoది.చప్పరమంటే గుడారం.పందిరి,జాతరలో చివరి రోజు చప్పరాల మ్రోక్కుబళ్ళు చెలిస్తారు.గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు దబ్బలతో తయారు చేసి,వాటిని శరీరంఫై నిలబెట్టు కోవడానికై జాతరలో ఒక ప్రతేయ్యకత.కోరికలు ఫలిస్తాయన్న నమ్మకంతో శరీరాకృతికి అనుగుణంగా సర్పరాలను ఏర్పాటు చేసుకొంటారు.సోమవారం రాత్రి నుండి ఈ వేషదారులు శరీరమంతా గంధం పూసుకొని మెరిసి దుస్తుల్ని నడుముకు ధరిస్తారు.మల్లెపూలు తలపాగా వాలే చుట్టూ కొంటారు.వెదురు పుల్లలు తెచ్చి,నట్టింటబెట్టి, కుంభంవేసి,హారతులు ఇస్తారు.వెదురు దబ్బాల్ని గోపురకారంగా వంచి,తయారుచేసి,రంగు రంగుల కాగితాలను అతికించి,గోపురంలో బొమ్మలాగా బెండ్లతో తయారుచేసి అమర్చుతారు.లయబద్దంగా చిందులు వేస్తూ వెళ్లి,అమ్మవారిని దర్శిస్తారు.ఈ సర్పరాల నిర్మాణం ఎంతో కళాత్మకంగా ఉంటుంది. ఈ గోపురాకర నిర్మాణవిన్యాస ప్రదర్శన  అద్వైత బావనకు సంకేతం.దేహమే దేవాలయం.జేవుడే దేవుడు.అజ్ఞాన నిర్మల్యాన్ని త్వజించి,నేనే ఆ పరమాత్మానైయున్నాననే బావనతో పూజించమంటుంది.-శాస్త్రం! ఇచ్చట గోపురం=దేవాలయం,ధరించిన వ్యక్తి జీవుడు.అతని హృదయంలోని గంగమ్మయే ఆత్మ.మ్రొక్కుబళ్ళు చెల్లించటం సర్వ సమర్పణం! అపుడు మిగేలేది ఆనంద మొక్కటే! గోపురమంటే పురద్వారం.దేవాలయద్వారం.`శురులచే రక్షింపబడునది అని ఉత్పతి.కామక్రోదాదులచే శత్రువుల్ని లోనికిరానివ్వాకుండా రక్షించేది-ఈ గోపురం.కనుక సర్పరాల సంబరం జ్ఞానానంద నిలయం!