బండ వేషం

                                                          బండ వేషం

   రెండోవ రోజు `బండ వేషం వేస్తారు.అమ్మవారి మీద భక్తితో గురువారం ఉదయాన్నే చిన్న పెద్ద అందరు ఒంటికి రంగులు పూసుకొని,అడవిలో పూచే బండ పూలతో మాలలు కట్టి మెడకు, భుజాలకు మణి కట్లకు ధరించి ,ఒక రోకలిని, ఒక కర్రను పట్టుకొని, ఒకదాని కొకటి తట్టు కొంటూ,బూతులు తిట్టుకొంటూ అందరు గుంఫై గంగమ్మ గుడి వద్దకు వస్తారు. అక్కడ కర్పూరం వెలిగించి, తాము ధరించిన బండ పూల దండల్ని ట్రేoపి,అమ్మవారి ముందుంచి,ఇళ్ళకు వెళ్ళతారు. ఈ వేషానికి తగినట్లు `పచ్చి బండ బూతులు` తిట్టడం ఆనవాయితి.ఈ మాటలు విని అందరు బండవాలే నిర్ఘంతం కావాల్సిందే కాని కోపం,బాధ చెందరాదు


  బండ=స్టాణువు,కదలిక లేనిదీ,బండ వేషంలో ధరించేవి బండ పులు,ఆనాడు తిట్టేవి బండ బూతులు, ఎన్ని కష్టలు,నిందలు వచ్చినా,అవి శరీరానికే కాని మనస్సుకు కావని,ద్వంద్వాలను సహించి సదా సంతోషంగా వుండాలని,ద్వంద సహిస్టత మొదటి వేషమైన వైరాగ్యనికి ఫలమని- ఈ బండ వేషం నిరూపిస్తుంది. ద్వంద్వాతితుడు విషాన్ని కూడా అమృతంగా మార్చుకోగలడు.అట్టివాడు కనుకనే శివుడు `స్టాణువు `అయ్యాడు.అట్టి స్టాణుత్వప్రాప్తి సంపూర్ణ జ్ఞానానికి ఫలమని చాటి చెప్తుంది-ఈ బండ వేషం ద్వారా గంగాంబ!