మాతంగి వేషం

                                           మాతంగి వేషం

ఆదివారం ఈ వేషం వేస్తారు. ఇది అరవనాటిది. మాతంగి వేషాన్ని ముఖ్యంగా మ్రొక్కుబడి వున్న వల్లే వేస్తారు.ఉదయం స్నానంఅనంతరం తలకు పసుపు గుడ్డను జడలగా కట్టి,కొప్పు ముడివేసి మల్లె పులు చుట్టూ కొంటారు. శరీరంఅంతా గంధం పూసుకొని తెల్ల గళ్ళ చీర లేదా పసుపు చీర కట్టుకొని రవిక తొడుగుతారు.మేడలో పూల హారం ధరిస్తారు. ఒడిబాలు(ఒడిబియ్యం) కట్టుకొని అందులో అక్షతలు దువ్వేనే,భరణి,రవిక గుడ్డ,పసుపు,కుంకుమ ఉంచుతారు.`మాతంగి వెయ్యి కళ్ళ దేవతా అని తలంచి, ముఖానికి,శరీరంఅంతా నల్లని ఎర్రని బొట్లు పెట్టు కొంటారు.ఫలకలు వాయిస్తూ,కొమ్ములు ఊదుతూ వుంటే మాతంగి వేషం వేసిన్ వాళ్ళు లయబద్ధంగా చిందులు వేస్తూ వచ్చి,అమ్మవారిని దర్శించి,మ్రొక్కు బళ్ళు సమర్పిస్తారు.ఈ వేషాన్ని గుడి తరుపున మిరాశిదార్లు వేసే మాతంగి వేషంలో కైకాల కులస్తుడు ఒక్కడే పాల్గొంటాడు. చాకలి కులస్తులు పాల్గొనరు. మాతంగి వేషాన్ని గంగమ్మ విశ్వ రూపంగా బావిస్తారు మాతంగి వేషదారి తన ఒడిబాలులోనున్న అక్షతలను వేపాకును అందరికి పంచిపెట్టుతూ,పట్టణంలో అందరి ఇండ్లకు వెళ్లి,పూజలు అందుకొంటారు.ఈ వేషం వేసినవారి వెంట అతని బంధుమిత్రులు కుడా ఉంటారు

             మాతంగి=మతంగమహాముని పుత్రిక.ఈమే సాక్షాత్తు పరాశక్తి.ఒక మహా విద్య కుడా! `మహారాణిగా పుట్టినింటి సారేగైకొన్న అమ్మవారు ఆనందాతిశయంతో తన విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. ఒక అవతారంలో మంతంగ మహా ముని పుత్రికగా రూపొందింది-అమ్మ వారు.సహస్రాక్షిగా మాతంగిగా ఉంటుందని బావించడం పరాశక్తి యొక్క అనంత నేత్రాలతో కూడిన విశ్వక్షిత్వానికి, సంకేతం,తెల్ల చీర సత్వగుణానికి,పసుపు చీర మంగళత్వానికి,మల్లె పూలు సద్భావాలకు,అక్షతలు అక్షయత్వనికి,మంగళ ద్రవ్యాలు సౌభాగ్యానికి సంకేతాలు.సకల సౌభాగ్యాలు,సకల శుభాలు అందరికి నా వల్లనే సిద్దిస్తున్నాయనిఅనడానికి -అందరికి ఆ వస్తువులను పంచి పెట్టడం! ఇచ్చట ఆత్మ యొక్క సాకారరూపమే మాతంగి అని బావించాలి.జగత్తు సర్వము శక్తీ మాయం కదా! ఆ శక్తియే గంగమ్మ విష్ణు సోదరి,తన్నుతాను గుర్తించడమే కదా నిజమైన జ్ఞాన ఫలం! అదే మాతంగి రూప ధారణం!మాతంగి రూప దర్శనం.