భైరాగి వేషం

                                                    భైరాగి వేషం

   భైరాగి వేషం బుధవారం వేస్తారు. `బైరాగి` అంటే వైరాగ్యం గలవాడు సన్యాసి,జాతర చాటింపు వేసినారని తెలియడంతోనే చిన్న పిల్లలో ఉత్సాహం,ఆనందం పెల్లుబుకుతుంది.వారం రోజుల పాటు భౌతిక సంసారిక వృత్తి ప్రవృత్తుల నుండి మనస్సును,శరీరాన్ని మరల్చి వివిధ వేషాలతో,గంగమ్మ దేవతా నామస్మరణతో జీవితాన్ని భక్తనంద మర్ఘంలో గడప వచ్చు ననే ఆకాంక్ష అందరిలో చిగురిస్తుంది.ఈ ఆకాంక్ష తరతమ భేదాల్ని తారుమారు చేస్తుంది. ఎండా,వాన అనుకోకుండా వేల కొలది భక్తులు `భైరాగి వేషాల్లో శరీరంఅంతా విభూది లేదా నామాలు ధరించి,రెళ్ళ కాయల మాలలు ధరించి అమ్మ వారి ఆలయం చేరుతారు.వేషంతో ఇంటి నుండి బయలు దేరడంతోనే బూతుమాటలు మేము వస్తున్నాం మంటూ మొదలవుతాయి.ఆ మాటలు అంటూ, ప్రజల్ని భయపెడుతూ వచ్చి, ఆలయంలో పసుపు,కుంకుమ,వేపాకు, సమర్పించి,అమ్మవారి పాద పద్మములఫై వినమ్రులైనమస్కరిస్తారు.తరతరాల తారతమ్యంభక్తి బావనికి అడ్డురాదని,శరిరాభిమానం కాసింతైన వదులుకొని,భక్తితో జగన్మాతను సేవించి తరించందని ఈ వేషాలు నిరుపిస్తాయి


            మోక్షానికి వైరాగ్యం ప్రముఖ సోపానమని చాటి చెప్పడానికే అమ్మవారు మొదటిరోజు `బైరాగి వేషం` దాల్చింది. త్యాగానికి ఫలం వైరాగ్యం! త్యాగేనైకే అమృతత్వ మానశు ` ఒక్క త్యాగం చేతనే మానవుడు మాధవుడు అవుతాడు అనింది ఉపనిషత్తు.వస్తువుల యందు రాగం,అభిమానం,కోరిక లేక పోవుటే విరాగిత్వం! విరాగి నిర్భాయుడు,నిత్యనందుడు,నిత్య తృప్తుడు కాగలడు,విరాగియై- విశ్వంలో సంసారంలో వున్న తామరాకు ఫై నీటి బొట్టులాగా అంటి అంటక హాయిగా వుంటాడు. .మానవుడు,ముందుగా దేహభిమానం నశించాలి.పిదప  దైవాభిమానం చేకూరుతుంది.అందుకే మొదటిరోజు దేహభిమానం తోలగాడనికై భక్తులు భైరాగి వేషాన్ని వేస్తున్నారు.అయితే దిన్ని వేషంగానే బావించక,క్రమ క్రమంగా ఈ వేషాన్ని అందులో తానున్న స్తితిని గుర్తుంచు కొంటుంటే వైరాగ్య భావన ఉదయిస్తుంది.వైరాగ్యం లేని చోట స్వార్ధం,స్వార్ధం ఉన్న చోట రాక్షసత్వం తాండవిస్తుంటాయి.బూతు మాటలు కుడా దేహం మిద బౌతిక సుఖాల మీద వున్న వ్యామొహాన్ని తొలగించే సాధనాలు అవుతాయి.