తిరుపతి గంగ జాతర

                                             తిరుపతి గంగ జాతర
తిరుపతి పేరే పవిత్రతకు,భక్తికి ,సంకేతం,తిరుపతి శబ్దం విన్నంతనే శ్రీ వెంకటేశ్వరస్వామి మనో మందిరంలో విహరిస్తూ ఉంటాడు.కలియుగ వైకుంఠoగా పేరు గాంచిన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతి.నేటి తిరుమల ఒకప్పుడు ఎగువ తిరుపతిగా,ఇప్పటి తిరుపతి దిగువ తిరుపతిగా పిలువబడేది.ఇప్పటికి యాత్రికులు `తిరుపతికి వెళ్తున్నాం` మానే చెప్పుతుంటారు.శ్రీ పతి నివాసమే తిరుపతి!.

  సాధారణంగా ఇప్పటి పెద్ద పెద్ద పట్టణాలన్ని ఒకనాటి గ్రామాలే! గ్రామ ముంటే ఒక గ్రామ దేవతా ఉండడం,ఆ దేవతను ఎవరికీ తోచిన పద్ధతిలో వారు పూజించడం సర్వ సాదారణ అంశం

తిరుపతికి గ్రామ దేవత గంగమ్మ ,రాయలసీమలో చాలా చోట్లా గంగమ్మే గ్రామదేవతగా పూజలు అందుకొంటున్నది.నేటికి తిరుపతిలో ఒకే గంగమ్మ దేవతా, తాళ్ళపాక గంగమ్మ,తాతయ్య గుంట గంగమ్మ అనే రెండు పేర్లతో దగ్గర దగ్గరలో రెండు చోట్ల రెండు మూర్తుల్లో ఆరాదింపబడుతుంది.మూర్తులు,పేర్లు రెండైన దేవతా గంగమ్మే!