తోటి వేషం

                                                       తోటి వేషం

 ఇది మూడోవ నాటి వేషం.శుబ్రపరిచేవారిని(విధులు) బలి తిరిగేవారిని `తోటి వారంటారు.శుక్రవారం మధ్యాహ్నం నుండి తోటి వేషాన్ని గుడి తరపు వాళ్ళు,తిరుపతి వాసులు వేస్తారు. ఈ వేషంలో కైకాల కులస్తుడు స్త్రీ వేషాన్ని,చాకలి కులస్తుడు పురుష వేషాన్ని ధరిస్తారు.స్తానికులు వేసి తోటి వేషంలో పిల్లలు బాగా పాల్గొంటారు.బొగ్గు పొడిని గాని బండి కందేన గాని ఒళ్ళంతా పూసుకొని,తెల్ల నామం చాది,కను బొమ్మలఫై చుక్క బొట్లు పెట్టు కొంటారు.పిల్లలు మీసాలు కుడా పెట్టు కొంటారు.నడుము చుట్టూ తలకు వేపాకు మండలు కట్టుకొంటారు.పాత పారక, చేట చేత పట్టుకొని కనిపించిన వారిని చిన్నగా కొడతారు.బూతుపాటలు పాడుకొంటూ గంగమ్మ గుడికి వచ్చి, ముందుగా వేపాకుమందలు, పిదప చేటా పారక పారేసి,గంగమ్మను కుడా తమ బూతు మాటల పాటల్తోనే మెప్పించి వెళ్ళతారు.

   తోటి వారికీ సహాయం చేసి,తోర్పడే వేషం `తోటి వేషం` వీధుల్లో మనం వేసిన చెత్త చెదారాన్ని తోడివారు చిపురుతో త్రోసి, చేటలోనికి వేసికొని దూరంగా తీసుకువెళ్లి పారేసి,మనల్ని ఆరోగ్యంగా వుండేటట్లు చేస్తున్న మహా సేవకుడు `తోటివాడు.వాని తోటివాడు మరొకడు లేడు.సహనం,సమాజ సేవా దృక్పధం,ద్వందాతీత్వం,తోటివాని నుండి మనం గ్రహించవలసిన గుణాలు,మనకు అసహ్యమైన పదార్దాల్ని-సాటి మానవుడైన తోటివాడు ఏ మాత్రం అసహ్య పడక-చీపురు కట్టతో త్రోసి,చేటకేత్తుకొని పరిసరాన్ని శుబ్రం చేస్తున్న ఇతని సేవా మాధవ సేవాయే.

   మొదటి నాటి వేషంలోని వైరాగ్యం ,రెండోవ నాటి ద్వంద్వ సహిస్టత స్వార్ధానికి పరిమితం కాకుండా,అవి సమాజ సేవలో అంకింతం కావాలి.అపుడే సంపాదించిన సాధించిన వైరాగ్యది సాధన సంపద సార్ధకం అవుతుంది.`మానవ సేవయే మాధవ సేవా అనే ఉత్తమ ప్రభోదాన్ని ఆచరణ ద్వార నిరూపిస్తుంది. తోటి వేషం. శుబ్రం చేశాక,అందుకు సాధనలైన చేటా, పారక-ఇంకెందుకు ? వాటిల్ని గంగమ్మకే సమర్పించి,నీఆజ్ఞను నిర్వర్తించినా మన్న సంతోషంలో మైమరఛిన స్తితిలో ఏవో పాడుకొంటూ వెళ్ళడం- ఒక గొప్ప ప్రజ్ఞస్తితి! మనస్సులో దాగి వున్న తుచ్చమైన కోరికలన్నీ బూతుల రూపంలో వ్యక్తమై- వెళ్లి పోవడంతో-పిదప మనస్సులో అమ్మ వారె స్తిరంగా వుంటుంది. తనలో తీరని కామవాంఛలే బూతులుగా వెల్లడి అవుతాయి. అని బావించాలి


  తోటి వారికీ సాయ పడడమే తోటి వేషం నిరూపించే సాటి లేని ధర్మ ప్రభోధం! అందుకే జగన్మాత మూడోవ నాడు `తోటి వేషాన్ని` వేసింది.ఈ మూడు రోజులు వేసి వేషాల్లో పిల్లలు వేసి వేషాలే ఎంతో ప్రాశస్త్యం వహిస్తాయి.వీటిల్ని మ్రొక్కుబడి ఉన్న లేకున్నా అందరు వేస్తారు బైరాగి, బండ,తోటి వేషాలకు మాత్రమే బూతులు మాట్లాడటం,బూతు పాటలు పాడటం వుంటుంది. తక్కిన వేషాలకు బూతుపాటలు పాడరు