దొర వేషం

                                                        దొర వేషం

దీన్ని శనివారం వేస్తారు.ఈ వేషాన్ని కైకాల,చాకలి కులస్తులే అనువంశికంగా వేస్తారు. ఇతరులు ఎవ్వరు వేయరు.దొర వేషంలో స్త్రీ వేషం ఉండదు. కైకాల కులస్తుడు దొర వేషాన్ని,చాకలి కులస్తుడు మంత్రి వేషాన్ని వేస్తారు. ప్రక్కనే త్రోటివాడు పాలే గాని తలను చేత పట్టు కొని వుంటాడు. మునుపు దొర వేషగాళ్ళు గుర్రలఫై ఊరేగేవారు.ఇప్పుడు వడిచి వెళ్తారు.భటుల వేషంవారు రాజ చిహ్నాలు ఉన్న సురటిలను (గుండ్రని విసన కర్రలను) పట్టు కొని ఉంటారు. దప్పుల వాద్యాలతో చూడ ముచ్చటగా కళాత్మకంగా వుంటుంది.- దొర వేషం.ఈ వేష దారులు ఊరంతా తిరిగి పూజలందు కొంటారు. తిరుపతిలో వారెగాక, సుదూర ప్రాంతాల నుంచి కుడా ఈ వేషాలు వేసుకొని తిరుపతికి వచ్చి, పుర వీధుల్లో ఊరేగే,గంగమ్మను పూజించి వెళ్తారు

  ఇంతే కాకుండా గంగమ్మ భక్తులు పౌరాణిక జానపద, సాంఘిక వేషాలు ఎన్నో వేస్తారు. ఈ వేషాలు చుపురాలకు ఎంతో ఆశ్చర్యన్ని,ఆనందాన్ని, వినోదాన్ని కలిగిస్తాయి. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు ఈ వేషాల సందడి ఉంటుంది. శివుడు,రాముడు, కృష్ణుడు,హనుమంతుడు,దుర్యోదునుడు వంటి పౌరాణిక వేషాలు ,రాజు, మంత్రి, భటుడు, జ్యోతిషుడు,మాంత్రికుడు,పూజారి, డాక్టర్, రోగి, రౌడి, త్రాగుబోతు,దొంగ, స్త్రీ వంటి సాంఘిక వేషాలు,చాకలి,కుమ్మరి, యానాది, లంబాడి, నక్కల, సోది వంటి జానపద వేషాలే  ఈ ప్రదర్శనలో ఉంటాయి.ఊరక వేషమే కాక, డానికి తగిన పాటలు పాడతారు

  ఈ వేషాలు కొందరు ఉత్సాహంతో,కొందరు మ్రొక్కుబడి చెల్లించేందుకు వేస్తారు. అందరు చివరకు గంగమ్మను దర్శించి పూజిస్తారు.నిజమే కదా! సర్వ కర్మలుజ్ఞానంలో పరిసమాప్తం అవుతాయని గీత చెప్పింది.అక్షర సత్యం

  ఏ కార్యం సాధించాలన్న కేవలం ఉత్సాహశక్తి ఒక్కటే చాలదు,ఉరకలేసె ఉత్సాహాన్ని నియమంతో నడిపించి,కార్యం సత్ఫలవంతం,ఆదర్శవంతం కావడానికి ప్రభు శక్తి కుడా కావాలి. అప్పుడి జీవితం నియమ పూర్వకంగా ఒడుదుడుకులు లేకుండా కొనసాగుతుంది.


  దొర= రాజు,ప్రజల్ని రంజింపచేస్తూ ధర్మ భద్దంగా పాలించడం రాజ ధర్మం, ఇందులో దుస్ట్ట శిక్షణ శిస్ట రక్షణ వుంటాయి.గంగమ్మ దొర వేషంలో సంహరించి,కామాంధుడైన పాలేగాన్ని హతమార్చడంలో దుష్ట శిక్షణ, యువతీజనాన్ని కాపాడడంలో శిష్ట రక్షణ జరిగింది.అంతరంగ శత్రువులు అయిన ఆరింటిలో మొదటిది అయిన కామమే శత్రువు. తక్కిన క్రోధ లోభా మోహమదమత్సర్యాలు కామాన్ని అనుసరించి ఉంటాయి. కామరూప శత్రువును తప్పక జయించమనింది. భగవద్గీత,కామందుల్ని శాసించే శక్తియే చొర, కనుక ఇటు ప్రభు రూపంలో పరాశక్తి కామరూపుడైన పాలేగాన్ని తల నరికి, చంపింది, అంటే కామాన్ని కుడా సంహరించింది


   కల్గిన వైరాగ్యబావన స్టిరపడాలంటే కామాన్ని జయించడం చాలా అవసరమే! కామదాసుడైన వాడు రామ దాసుడు కాలే డని పెద్దలంటారు.అమ్మవారు `మహారాణి` పరమేశ్వరుడు సర్వేశ్వరుడు-కనుక అభేద స్టితిగల దంపతులు(ఈశ్వరి ఈశ్వరులు) కామాన్ని హతమార్చడంలో సిద్దహస్తులు!కోరికలను జయించిన వారు విశ్వాన్నే జయించినవారు కాగలరు.కామ జయం మోక్షానికి చివరి సోపానం. తల నరకడం కోరికలను సమూలంగా నరకడమే.

    విశ్వమే తానైన విశ్వేశ్వరి ఏ వేషం ధరించిన  అది లోక కళ్యాణం కోసమే తప్ప అందులో స్వార్ధానికి తావుండదు. దొర వేషంలో పాలేగాన్ని తల నరకడం కామంతో కన్ను మిన్ను కనక ప్రవర్తించే వారికీ ఇదే గతి పట్టుతుందని చాటి చెప్పడం ఇందున వున్న అంతర్యం