సున్నం కుండలు

                                                 సున్నం కుండలు


         ఈ వేషాన్ని సోమవారం ఇద్దరు కైకాల కులస్తులు వేస్తారు. ఈ ఇద్దరు పెద్ద గంగమ్మ,చిన్న గంగమ్మలకు ప్రతికాలు,రెండు కొత్త కుందలకు సున్నం పూసి,కుంకుమ బొట్లు పెడతారు.కుండ క్రింద భాగం మధ్యలో చిన్న రంద్రం ఏర్పరుస్తారు. కుండల అంచులవద్ద మూరెడు పొడవు ఉండే నాల్గు వెదురు పుల్లల్ని కట్టి, వాటి ఆధారంగా అడ్డు పుల్లల్ని చుట్టూ కడ్తారు.ఈ సున్నం కుండల్ని వేషాదారుల తలఫై కిరిటంగా అమర్చుతారు.వెదురు దబ్బలకు మల్లెపూలు చుట్టుతారు. ఈ వేషం ధరించినవారు పసుపు చీర కట్టుకొని,రవిక దాల్చి,సొమ్ములు,పెద్ద కమ్మలు ధరిస్తారు.ఓడిబాలులో మంగళ ద్రవ్యాలు ఉంచుకొంటారు.చుట్టూ పంబలవాళ్ళు పంబలు వాయిస్తూ పాటలు పాడుతూ వెంట వస్తుండగా ఇంటింటికీ వెళ్లి, పుజలుందుకొంటారు

  సున్నం కుండల వేషంలో ఎంతో ఆధ్యాత్మిక స్పూర్తి ఉంది. కుండ శరీరానికి సంకేతం.డానికి సున్నం పూయడం దాన్ని (శరీరాన్ని) శుద్దసత్వమాయం చేయడం,కుంకుమ బొట్లు పెట్టడం డానికి మంగళతత్వం కలిగించడం,కుండ క్రింద చిన్న రంద్రం-కుండలినీశక్తి స్టాన సంకేతం.మూతి అంచు వద్ద కట్టే నాల్గు వెదురు పుల్లలు ధర్మార్ధకామ మోక్షలకు,అడ్డంగా చుట్టే పుల్లలుఅంతఃకరణ చతుష్టయానికి(మనో బుద్ది చిత్తహంకరాలకు) సంకేతాలు.మల్లెపూలు సద్భావనలకు చిహ్నాలు,పసుపు చీర-కల్యాణ ప్రదత్వానికి గుర్తు,వాద్యాలు మంగళ వాక్కులకు సంకేతాలు.ఇలా సున్నపు కుండల వేషాలు రెండే వుండటం ఇద్దరు గంగామ్మలకే కాక జీవాత్మ పరమాత్మలకు కుడా వర్తిస్తాయి.కుండలలోని శూన్యం భావ రాహిత్యానికి-అంటే నిర్వికార చిత్తతకు దుస్ట్టంతం.ఆ కుండల వంటి స్టితిలో నిర్మలంతః కరుణులైనవారు శుద్దసత్వ గుణంతో ప్రకాశింఛి,అమ్మవారి దయకు పాత్రులై జన్మరాహిత్యాన్ని,శాశ్వతఆనందాన్ని పొందుతారు. అమ్మవారు ఆనందరూపిణి,ఆనందదాయినికుడా.వీరు జ్ఞానముర్తులనే భావంతో భక్తులు వీరిని కుర్చిలలో కూర్చోబెట్టి,కాళ్ళు కడిగి,పాద పూజలు గావించి నమస్కరిస్తారు.స్టానికులు అనేక వేషాలతో వచ్చి అమ్మవారిని దర్శిస్తారు

  
           ఈ సోమవారం రాత్రి 12-15 ని''ల కు అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అమ్మవారికీ జాతరలో `చాటు` రోజు మొదలు-మాతంగి వేషం రోజు మొదలు -మాతంగి వేషం రోజు వరకు భిన్న భిన్న రీతులో చిత్ర విచిత్ర వేషదరనల్లో అలసిన అమ్మవారిని శాంతిoప చేసేoదుకై సోమవారం రాత్రి క్షీరాభిషేకం,పంచామృతాభిషేకం,నారికేళ జలాభిషేకం,పసుపు నీళ్ళతో అభిషేకం,ఇంకా అనేక మంగళ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకం జరుపుతారు. అర్చకులు,పిదప విశేష పుష్పాలంకరo జరిపి,భక్తుల్ని అమ్మ దర్శనం పాత్రుల్ని చేస్తారు.


 పంచామృత ద్రవ్యాలతో ,సుగంద మంగళ ద్రవ్యాలు  కలిపిన జలంతో విగ్రహానికి అభిషేకం చేయిoచడం వల్ల విగ్రహంలో సాత్వికత,నిర్మల తేజస్సు,శాంతగుణం,కృపా గుణం వృద్ది అవుతుంది.మూర్తి సౌమ్యoగా,సుందరంగా గోచరిస్తుంది

 దుస్థశిక్షణలో గైకొన్న రాజసతామాసగుణ ప్రభావం-ఈ క్షీరాభిషేకాదులవల్ల తగ్గిపోయి, విగ్రహంలో సత్వగుణం,శాంతస్వభావం నెలకొంటాయి. శిస్థ రక్షణకు కావలసిన సౌమ్య రూపం ఏర్పడుతుంది.కృపారస ప్రపూర్ణ హృదయయైన గంగమ్మ-అమృతాభిషేఖంతో కృపామృత మూర్తియై సోబించి,భక్తుల్ని చల్లగా కాపాడుతుంది.