ఉత్సవాలు

                                                      ఉత్సవాలు

  `జాతర అనే పదం `యాత్ర అనే సంస్కురత పదానికి వికృతి.ప్రజలందరూ మంగళ ద్రవ్యాలతో,నైవేద్ద్య పదార్ద్దలతో ఒక దేవతా వద్దకో,పుణ్య స్టలమునకో ,నదికో,సముద్రానికో గుంపుగా వెళ్లి అక్కడ పూజలు సల్ఫి,మ్రోక్కుబడ్లు చెల్లించి,దైవానుగ్రహం పొందదానికై చేసే ప్రయత్నం ను యాత్ర అంటారు.ఇదే జాతర ! భారతం మౌసల పర్వంలో యాదవులు అందరు శ్రీకృష్ణుని ఆదేశానుసారం సముద్రతీరానికి జాతర చేసివారని వుంది


   ఇలా అన్ని వర్ణాలవారు ,వర్గాలవారు ఒకుమ్మడిగా జాతర చేయడం వల్ల ప్రజల్లో ఐకమత్యం,ఆత్మీయత,స్నేహం ఏర్పడ్డాయి.

  తిరుపతిలో గంగమ్మ దేవతా జన్మదినం ఏర్పడే చైత్రమాసం తమిళ సంప్రదాయానుసారం -చివరి వారంలో జాతర మహా వైభవంగా జరుగుతుంది. ఈ జాతర ఉత్సవం వారం రోజులు ఉంటుంది. ఇలా జరిగే ఏడూ రోజులు జాతర సంభరాలు జరుగుతాయి

  పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పాలించేవారు. ఆ రోజుల్లో ఒక పాలెగాడు యువతుల్ల్ని కామించి, భాలత్కరించేవాడట! వాణ్ణి హతమర్చి,స్త్రీ శిలాన్ని కాపాడేందుకు పరాశక్తీ గంగమ్మగా అవతరించింది.ఈ విషయం పసికట్టిన ఆ పాలెగాడు ప్రాణభయంతో గంగమ్మకు కన్పించకుండా- ఎక్కడెక్కడో దాగి జివించేవాడట! అతన్ని ఎలాగైనా బయటకు రప్పించి,ఎట్లైనా వాణ్ణి హతమార్చాలని ప్రతిన పట్టిన గంగమ్మ రోజుకొక వేషం ధరించి,నానా భూతులు(చెడ్డ మాటలు) తిడుతూ తిరుగుతుండగా, చివరకు దొర వేషంలో వున్నవాడు పాలేగాన్ని కనిపెట్టి,అతని తల నరికి చంపుతుంది. ఇలా కామాంధుడైన పాలేగాన్ని సంహరించిన దినమే గంగమ్మ జన్మదినమైన చిత్రినేల కావడంతో, చివరి వారంలో గంగమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు

ఆనాడు గంగమ్మ దేవతా పాలేగాన్ని కనిపెట్టేందుకు రోజుకో వేషంలో తిరిగినడానికి గుర్తుగా- భక్తులు ఈ ఏడు ఉత్సవాలలో అట్టి వేషాల్లో భూతులు తిడుతూ తిరిగితే గంగమ్మ తల్లి సంతోషించి తమ కోర్కెలు తీరుస్తుందని  భక్తుల నమ్మకం.ఈ జాతరకు అనేక ప్రాంతాలనుండి జాతిమత కుల వివక్ష లేకుండాభక్తులు విశేషంగా  వస్తారు. పరశక్తి స్వరూపిణిగా,మంగళ ప్రదాయయినిగా శ్రీ వేంకటేశ్వరుని చెల్లెలుగా తిరుపతి,తత్పరిసర ప్రాంతంవారి ఆరాధ్య దేవతగా పూజలందుకునే గంగమ్మ జాతర ప్రారంభ సూచకంగా మంగళవారం అర్ధరాత్రి వేళా చాటింపు వేస్తారు. తిరుపతి సమీపంలోగల అవిలాల గ్రామం జన్మస్టలం.కనుక ఈ ఉత్సవాలు చాటింపురోజున అవిలాల గంగమ్మ గుడివద్ద,గ్రామ పెద్దలనుండి పసుపు కుంకుమలు స్వీకరించి,జాతర చాటింపుతో ఉత్సవారు ప్రారంబిస్తారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తరుపున తిరుపతికి చెందిన `కైకాలవారు` తిరుపతి పోలిమేరల్లో చాటింపు వేస్తారు

  గంగా జాతర పూర్తి అయ్యేవరకు ఊర్లోని వారెవ్వరూ పొలిమేర దాటి వేరే ఊర్లకు పోరాదని ఈ చాటింపు ఉద్యేశ్యాం!తనను మోహించిన పాలెగాడు తన చేయి పట్టుకొని అవమానించాడని ,గంగమ్మ దేవతా అతని కోసం వెదకడం జరుగుతుందని భక్తుల విశ్వాసం! అందుకే వేషాల రోజుల్లో మొదటి రోజు భైరాగి వేషం.