పేరంటాళ్ళ వేషం

                                           పేరంటాళ్ళ వేషం


 మంగళవారం నాడే పేరంటాళ్ళ వేషం కుడా వుంటుంది. ఈ వేషాన్ని కైకాల వాళ్ళే ధరిస్తారు. ఎర్రగళ్ళ చీరగట్టి,ఎర్రని గుడ్డలో ఓడిబాలు కడ్తారు. అందులో అక్షతలు,చావ్వకు,దువ్వెన,అడ్డం, నల్లగాజులు,పసుపు,కుంకుమ ఉంచుతారు.తలకు నల్లనిగుడ్డ కట్టి కొప్పులాగా ముడి వేస్తారు.ఆ కొప్పులో పూలు పెడతారు.తలఫై బంగారంలాగా కనిపించే అట్టలతో చేసిన జడ బిళ్ళలు,పట్టిల వంటి ఆభరణాలు కట్టుకొంటారు.పంబల వాద్యాలతో చాటు మండపం వద్దకు వెళ్లి పూజలందుకొని అటునుండి చిన్న గంగమ్మ చెంపనరికి, ఆ తరువాత పెద్ద గంగమ్మ చెంప నరకండంతో జాతర పూర్తి అవుతుంది.

 పెరంటాళ్ళ వేషంలో ఇద్దరు గంగమ్మలు ఒక్కతావుతారని భక్తుల బావిస్తారు

   శక్తి దేవతలకు,గ్రామ దేవతలకు జంతు బలులు ఇచ్చి,తృప్తి పరచడం అనాదిగా వస్తున్నా సాంప్రదాయం.ఇది ప్రాణి హింసతో కుడిందే అయినా చాలా చోట్లా జరుగుతున్నా విధానమే! ఒక్కక్క జంతువు ఒక్కొక్క గుణానికి సంకేతం.ఆ జంతువు బలి ఇవ్వడం ద్వార తనలోని ఆ గుణాన్ని శక్తి దేవతకు సమర్పించినట్లుగా బావించుకొంటారు.ఆ భక్తుడు.సంతానం కోసం ,దుస్ట్ట శక్తుల్ని పారద్రోలడంకోసం, నిధి నిక్షేపాలు పొందడం కోసం,దిస్త్తి దోషం పోవడం కోసం,కోరికలు తీరడం కోసం-ఇలా ఎన్నో ఆశలతో జంతు బలులు ఇస్తుంటారు. తిరుపతి గంగ జతరలోను ఈ పద్ధతి నేటికి కొనసాగుతూనే వుంది.ఎన్నో శతాబ్దాలుగా వస్తున్నా ఆచారాన్ని ఆపడం కష్టం! ఎవరెట్లు పూజిస్తారో వారిని దేవతా అట్లే రక్షిస్తుంది.

           బూతుమాటలు,పాటలు జాతరల్లో విశేషంగా వుంటాయి.ఇవి మనిషి హృదయంలో తీరిక దాగియున్నా కోరికలు వ్యక్తమయ్యేదశలో వచ్చే అప్రయత్న వాగ్రూపచర్యలు! ఇవి అలామాటలుగా,పాటలుగా వ్యక్తంకావడంతో,హృదయం విర్మలమై నేమ్మదిస్త్రుంది.ఈ బూతు మాటలు ఎక్కువుగా శృంగారానికి చెందినవై వుంటాయి.ఒకనాటి ప్రాచిన మానవుని మనోభావాలకు, శృంగార ప్రవర్తనకు అద్దం వంటిది-ఈ బూతులు,వీటిని గూర్చి ఎక్కువగా వివరించడం సముచింతం కాదు


   తిరుపతి గంగ జాతరలో పొంగళ్ళు, నైవేద్యం కుడా ఉంటుంది. పైన పేర్కొన్న వేషాలే కాక వారి వారి అభిరుచులను బట్టి ఎన్నో వింత వింత వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శించి వస్తుంటారు. మానవుని విశ్వాసం ఇంతటికీ మూలం! దేవత నిమిత్తం మాత్రం సర్వాన్ని సమతా దృష్టితో చూచి,రక్షించడం దేవతల కర్తవ్యం!

                 ఒకే విధ్య్తుత్ తో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లే భక్తి కుడా అనేక రూపాల్లో ,క్రియల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది.భౌతిక దృష్టి వేరు, ఆధ్యాత్మిక దృష్టి వేరు.ఈ రెండిటిని సమన్వయ పరుచుకొని,మనుగడ సాగించడానికి ఉత్సవాలు,జాతరలు ఏర్పడాయి.ఏ కార్యమైనా తాత్విక దృష్టితో చుస్తే- అంత భగవన్మాయంగానే గోచరిస్తుంది.గంగమ్మ జతరలోని బలులు,తిట్లు కుడా విలాసంగా,వినోదంగా,తాత్వికంగా బావించి ,దర్శిస్తే అంతా పరాశక్తి యొక్క చిద్విలాసమే తెలుస్తుంది.


   మొత్తంఫై తిరుపతి గంగజాతరకు ఎక్కడ లేని  విశిష్టత ఏర్పడింది.శ్రీ వేంకటేశ్వరుని చెల్లులుగా గంగమ్మకు గొప్ప స్టానం ఏర్పడింది.గ్రామ దేవతగా తిరుపతి పట్టణాన్ని నిత్యము శోభాయమానంగా అభిరుద్ది పధంలో నడిపిస్తుంది-గంగమ్మ దేవతా !