అమ్మవారికీ శ్రీవారి శేష వస్త్రాలు

                                 అమ్మవారికీ శ్రీవారి శేష వస్త్రాలు

శ్రీవారి శేష వస్త్రబహుకృతి(సారే) శనివారం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి గంగమ్మ చెల్లలు కదా! కనుక గంగమ్మ జాతర సందర్భంగా సారేగా శేష వస్త్రాలు,పసుపు,కుంకుమ, గంప, చేట మున్నగు మంగళ ద్రవ్యాలు శ్రీవారి తరుపున తిరుమల తిరుపతి దేవస్థానం వారు  ప్రతి సంవత్సరం అందజేస్తారు.ఈ కార్యక్రమాన్ని.శనివారం సాయంకాలం శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్తానంల ముఖ్య కార్యనిర్వహణదికారి నుండి,శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అధ్యక్షులు స్వీకరిస్తారు. పిదప తిరపతి శాసన సభ్యుల వారి ఆధ్వర్యంలో పట్టణంలో ఉరేగింపుగా సారేను తీసుకువెళ్లి అమ్మవారికీ సమర్పిస్తారు. ఈ మంగళ సారే ఊరేగింపు శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం నుండి కర్నాల విధి, బేరివిధి, గాంధీ రోడ్, బండ్ల విధి, పెద్ద కాపు విధి గుండా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి చేరుతుంది.భర్త ఎన్ని ఇచ్చిన- పుట్టినింటి వారిచ్చిన వాటిపైనే సామాన్యంగా స్త్రీలకు మమకారం, అభిమానం  ఎక్కువుగా వుంటుంది కదా!