గంగాదేవి ప్రాశస్త్యం

                                               గంగాదేవి ప్రాశస్త్యం

గంగ త్రిలోకపావని.దేవమానవ పాతాళ లోకాల్లో ప్రవహించి,అందర్ని నమోచ్చరణమాత్రంతోనే పవిత్రులిన్నీ చేస్తున్న పుణ్యనదిరూప దేవతా,అమరం, గంగా,విష్ణుపది,జహ్నుతనయా,సురనిమ్నగా,భాగీరధి,త్రిపదగా,త్రిశ్రోత,భీష్మసుహ అని పేర్కొంది,ప్రేతేయ్కించి,ఆకాశ గంగకు `మందాకినీ,వియద్గంగా,స్వర్నది,సురదిర్ఘికా` అనే పేర్లు ఉన్నాయి

హరి పాదం(ఆకాశం) నుండి భూమిని పొందింది కనుక గంగ,మరియు శివుని శిరస్సు నుండి భూమిని పొందింది కనుకను గంగ,విష్ణు పాదంనుండి పుట్టింది కనుక విష్ణుపది,జహ్ను మహాముని చేవియందు పుట్టింది.జాహ్నవి.దేవతలానది దేవనది,భగీరధునిచే భూలోకానికి తేబడింది  కావున భాగిరధి,స్వర్ఘమర్ధ్య పాతాళంలో ప్రవహిస్తుంది కనుక త్రిపధగ,మూడు ప్రవాహాలు కలది-త్రిస్రోత,భీష్ముని తల్లి కనుక భీష్మజనని గంగ జలస్వరూపం,ఆకాశం నుండి మేఘాల ద్వార నీరు వర్షారూపంలో మనకు లబిస్తుంది .గంగ ఆకాశం నుండి ఏర్పడింది.కనుక ఎక్కడున్నా జలమైన గంగా స్వరూపమే అవుతుంది.గంగను పూజించటం అంటే-జలతత్వదిదేవతను పూజించటమే! సృష్టికి మూలం నీరే! ప్రాణదారం నీరే! విశ్వమంత జలతత్వమయమే!

   భారతీయ సంప్రదాయంలో ప్రతి వస్తువు భోతికం,ఆధ్యాత్మికం అనే రెండు రూపాల్లో ఉంటుంది. భోతికం కంటికి కనిపించేది,ఆద్యాత్మిక రూపం మనస్సుతో బావించ బడి,ఆత్మకు గోచరించేదిఆత్మకు గోచరించే తత్వమే దేవతాగా బావించి మూర్తికల్పన చేసికొని మూర్తి ద్వారా అముర్తమైన పరతత్వాన్ని ఆరాధించటం జరుగుతుంది. కనుకనే గంగ,తులసి,రాగిచెట్టు,పర్వతాలు, పుణ్యనది తీరాలు,సముద్రాలూ, మున్నగున్నవి దేవతా రూపాలై భారతీయులకు ఆరాధ్యమూర్తులైనాయి. ఇలా రూపొందిన దేవతయే గంగమ్మ.

   గంగ దేవిని పూజించటం -సాక్షాత్తు జలాధి దేవతఅయిన పరాశక్తిని పుజించటంమే! శివుని శిరస్సు ఫై నునందున పురాణాలూ గంగ యొక్క పరాశక్తితత్వాన్ని గుర్తించి ,శివునికి భార్యగా నుతించాయి. పార్వతి విష్ణు సోదరి కనుక గంగను కుడా విష్ణు సోదరిగానే బావించారు. విష్ణువే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించినందున-గంగా దేవిని వెంకటేశ్వరునికి చెల్లలుగా స్తుతించారు. భక్తులు. కనుకనే తిరుపతి గంగమ్మ జాతరలో ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయం నుండి గంగమ్మ గుడికి గంప, చేట,పట్టు శేష వస్త్రం, పసుపు,కుంకుమలు వస్తున్నాయి.అంటే పుట్టింటి వారు ఆడ పడుచుకు పంపే మంగళ ద్రవ్యాల సారే వస్తుంది.కారణం లేనిదే కార్యం జరగదు కదా